వివిధ పోలీస్ భవనాల నిర్మాణానికై స్థల కేటాయింపు కార్యక్రమం
హైదరాబాద్, 6 మార్చి (హి.స. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం జోన్ కు సంబంధించి పోలీసు శాఖకు చెందిన వివిధ పోలీస్ భవనాల నిర్మాణానికై స్థల కేటాయింపు కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమల
వివిధ పోలీస్ భవనాల నిర్మాణానికై స్థల కేటాయింపు కార్యక్రమం


హైదరాబాద్, 6 మార్చి (హి.స.

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం జోన్ కు సంబంధించి పోలీసు శాఖకు చెందిన వివిధ పోలీస్ భవనాల నిర్మాణానికై స్థల కేటాయింపు కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు నూతన భవన నిర్మాణ స్థల కేటాయింపు లో భాగంగా వివిధ భవనాల నిర్మాణ సముదాయానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, పోలీస్ శాఖకు కావలసిన అన్ని రకాల సదుపాయాలు సమకూరుస్తూ తోడ్పాటు అందిస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ శాఖను మరింతగా బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరశాతం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ, విశేషంగా కృషి చేస్తున్నందుకు కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారిని మరియు అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు ఐపీఎస్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఐఏఎస్, డీసీపీ మహేశ్వరం సునీత రెడ్డి మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

PRO Rachakonda

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande