సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీచర్స్ ఎమ్మెల్సీ విజేత శ్రీపాల్ రెడ్డి.
తెలంగాణ, హైదరాబాద్. 6 మార్చి (హి.స.) ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా
ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి


తెలంగాణ, హైదరాబాద్. 6 మార్చి (హి.స.)

ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఎన్నికలో విజయం సాధించిన శ్రీపాల్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి పుష్పగుచ్చం అందజేసి విషెస్ తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తామని ఈ సందర్భంగా శ్రీపాల్రెడ్డి సీఎంకు స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande