ఏ.పీ, అమరావతి. 6 మార్చి (హి.స.)
ఏపీ యూనివర్సిటీల్లో ఖాళీలన్నీ ఈ ఏడాదిలోనే భర్తీ చేస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తాం అన్నారు. విశ్వవిద్యాలయాల్లో 4,330 శాంక్షన్ పోస్టులు ఉంటే కేవలం 1,048 పోస్టులు భర్తీ చేశారు. 3,282 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తాం అన్నారు. సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య, ఉద్యోగుల వివరాలు, ఖాళీల భర్తీ, యూనివర్సిటీల అభివృద్ధిపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..