హైదరాబాద్, 6 మార్చి (హి.స.) రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ఏఐ సిటీలో భాగస్వామ్యం కావాలని 'ఎన్ ఎక్స్ పీ' సెమీ కండర్టర్స్ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మినిస్టర్ క్వార్టర్స్ లో గురువారం 'ఎన్ ఎక్స్ పీ' సెమీ కండర్టర్స్ ప్రతినిధులతో శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. సెమీ కండక్టర్స్ తయారీ పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలను ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. 2030 నాటికి భారతదేశంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలంగాణలో ఉన్న ప్రతిభావంతమైన మానవ వనరులను వినియోగించుకోవాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి కోరారు. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణలో భాగస్వామ్యం కావడంతో పాటు, సెమీ కండక్టర్ల పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తయారు చేయాలని కోరారు. సెమీ కండక్టర్స్ తయారీకి సంబంధించిన ఆర్ అండ్ డీ యూనిట్ను తెలంగాణలో ఏర్పాటు చేయాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..