హైదరాబాద్, 6 మార్చి (హి.స.) అంబర్పేటలో ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం నూతన బిల్డింగ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ప్రారంభించారు, హైదారాబాద్ సీపీ సీవీ ఆనంద్, వీహెచ్ తో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ఈస్ట్ జోన్ కార్యాలయంలో ఇంకా అసంపూర్తిగా ఉన్న కొన్ని పనుల పూర్తికి సహకారం అందిస్తాను.. అంబర్ పేటకు రిజిస్ట్రేషన్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్ ఏర్పాటుకు కృషి చేస్తాను అన్నారు.. అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ స్థలం చూపించండి.. మీకు ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాలు కావాలన్నా ఏర్పాటు దిశగా సహకరిస్తాను అని పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది కాబట్టే.. ఈ రోజు విదేశీ పెట్టుబడులు తెలంగాణకి ఎక్కువగా వస్తున్నాయి.. ఇక, గత ప్రభుత్వం పోలీసుల సమస్యలు పట్టించుకోలేదు.. కానీ, మా ప్రభుత్వం పోలీస్ సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..