తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీగా గెలిచిన ఎన్డీఏ అభ్యర్థులకు మోడీ అభినందనలు
ఢిల్లీ, 6 మార్చి (హి.స.)తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. తెలంగాణలో గెలిచిన బీజేపీ అభ్యర్థుల మల్క కొమరయ్య, అంజిరెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్ర
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీగా గెలిచిన ఎన్డీఏ అభ్యర్థులకు మోడీ అభినందనలు


ఢిల్లీ, 6 మార్చి (హి.స.)తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. తెలంగాణలో గెలిచిన బీజేపీ అభ్యర్థుల మల్క కొమరయ్య, అంజిరెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో కలిసి పని చేస్తున్న తమ కార్యకర్తలను చూసి గర్విస్తున్నట్లు తెలిపారు.

అలాగే ఏపీలో గెలిచిన ఎమ్మెల్సీలకు కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఎక్స్ ట్విట్టర్‌లో సీఎం చంద్రబాబు పెట్టిన పోస్ట్‌ను మోడీ రీపోస్ట్‌ చేశారు. కేంద్రం, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని చెప్పుకొచ్చారు.

అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పారు. ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande