తెలంగాణ, 6 మార్చి (హి.స.) విద్య, వైద్య కోర్సులో ప్రవేశానికి జాతీయస్థాయిలో నిర్వహించే నీట్-2025 ప్రవేశపరీక్ష నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీని గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తో కలిసి పరిశీలించారు. యూనివర్సిటీకి వచ్చిన ఆమెకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆమె ఎంజీయూలోని ఆర్ట్స్ కళాశాల, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల, సైన్స్ కళాశాలను సందర్శించి వసతులను పరిశీలించారు. నిర్వహణకు సంబంధించి రిజిస్ట్రార్ అల్వాల రవిని అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రాన్ని కేటాయించినచో అన్ని మౌలిక సదుపాయాలతో పటిష్టంగా నిర్వహించి విజయవంతం చేయాలని ఆమె కోరారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్