తెలంగాణ, నిజామాబాద్. 6 మార్చి (హి.స.)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిత్యం ద్విచక్ర వాహనాల వింత వింత సైలెన్సర్లతో శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తూ జనాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు గురువారం కొరడా ఝులిపిన్చారు. సౌండ్ పొల్యూషన్ను కంట్రోల్ చేసేందుకు వారు నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. భారీ శబ్దంతో నడుపుతున్న వాహనాలను పట్టుకొని చర్యలు చేపట్టారు.
ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఎస్ఐలు ఇతర సిబ్బంది కలిసి నగరంలో భారీ శబ్దం చేస్తూ నడుపుతున్న 240 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను తొలగించారు. అనంతరం ధర్నా చౌక్ లో సైలెన్సర్లను రోడ్డుపై పెట్టి రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్