అనర్హులకు పెన్షన్ తీసేసినా తప్పులేదు:
విజయవాడ, 6 మార్చి (హి.స.)ఇప్పటివరకు ఏపీలో 14 వేల పెన్షన్లు తొలగించాము అని, కానీ లక్షల్లో పెన్షన్లు తొలగిస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పెన్షన్లపై సర్వే పకడ్బందీగా జరుగుతోందని, అనర్హులకు పెన్షన్ తీసేసినా తప్
అనర్హులకు పెన్షన్ తీసేసినా తప్పులేదు:


విజయవాడ, 6 మార్చి (హి.స.)ఇప్పటివరకు ఏపీలో 14 వేల పెన్షన్లు తొలగించాము అని, కానీ లక్షల్లో పెన్షన్లు తొలగిస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పెన్షన్లపై సర్వే పకడ్బందీగా జరుగుతోందని, అనర్హులకు పెన్షన్ తీసేసినా తప్పులేదన్నారు. 2019 జూన్ నాటికి సామాజిక భద్రత పెన్షన్ల కింద 53 లక్షల 85 వేల 796 మంది లబ్ధిదారులు ఉండగా.. ప్రస్తుతం 63 లక్షల 59 వేల 907 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని మంత్రి కొండపల్లి చెప్పారు. ఏపీ అసెంబ్లీలో పెన్షన్ లబ్దిదారుల వెరిఫికేషన్ గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబు ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande