న్యూఢిల్లీ,6 మార్చి (హి.స.):కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ కోర్టు రూ.200 జరిమానా విధించింది. సావర్కర్‌పై గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు రాహుల్ గైర్హాజరు కావడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. విచారణను ఏప్రిల్ 14కు వాయిదా వేస్తూ ఆ రోజు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. 2022లో మహారాష్ట్రలో ఓ సమావేశంలో వీర సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై నృపేంద్ర అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ జరగగా.. రాహుల్ గైర్హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల