అక్రమ లేఅవుట్ల.క్రమబద్ధీకరణ ఎల్ ఆర్ ఎస్ లో.సాఫ్ట్వేర్.కష్టాలు
, హైదరాబాద్‌: 6 మార్చి (హి.స.) అక్రమ లేఅవుట్లు క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌)ను సాఫ్ట్‌వేర్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. అకస్మాత్తుగా డేటా మాయం కావడం.. కొంత సమయం తర్వాత మళ్లీ ప్రత్యక్షం కావడం లాంటి పరిస్థితి ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక ఇబ్బందులు వ
అక్రమ లేఅవుట్ల.క్రమబద్ధీకరణ ఎల్ ఆర్ ఎస్  లో.సాఫ్ట్వేర్.కష్టాలు


, హైదరాబాద్‌: 6 మార్చి (హి.స.) అక్రమ లేఅవుట్లు క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌)ను సాఫ్ట్‌వేర్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. అకస్మాత్తుగా డేటా మాయం కావడం.. కొంత సమయం తర్వాత మళ్లీ ప్రత్యక్షం కావడం లాంటి పరిస్థితి ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక ఇబ్బందులు వల్ల ప్రక్రియ వేగంగా ముందుకు వెళ్లడం లేదు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు సంబంధించి సెంటర్‌ ఫర్‌ గుడ్‌గవర్నర్స్‌(సీజీజీ) సాఫ్ట్‌వేర్‌ను అందిస్తోంది. ఈ లోపాలను సరిదిద్దేందుకు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఒకటి, రెండు రోజుల్లో పూర్తిగా పరిష్కరిస్తామని చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande