మహబూబాబాద్ రైల్వే స్టేషన్.సమీపంలో మూడో.రైల్వే లైన్ పనులు పలు.రైళ్లు.రద్దు
, మహబూబాబాద్‌ 6 మార్చి (హి.స.) రైల్వేస్టేషన్‌ సమీపంలో మూడో రైల్వేలైన్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు ఖమ్మం రైల్వేస్టేషన్‌ మీదుగా వెళ్లే పలు రైళ్లను ఈనెల 6 నుంచి 13వ తేదీ వ
మహబూబాబాద్ రైల్వే స్టేషన్.సమీపంలో మూడో.రైల్వే లైన్ పనులు పలు.రైళ్లు.రద్దు


, మహబూబాబాద్‌ 6 మార్చి (హి.స.)

రైల్వేస్టేషన్‌ సమీపంలో మూడో రైల్వేలైన్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు ఖమ్మం రైల్వేస్టేషన్‌ మీదుగా వెళ్లే పలు రైళ్లను ఈనెల 6 నుంచి 13వ తేదీ వరకు రద్దు చేశారని ఖమ్మం రైల్వే చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎండీ జాఫర్‌ బుధవారం తెలిపారు. పలు రైళ్లను గుంటూరు, ఖాజీపేట్‌ రైల్వేస్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించారని వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు రాకపోకలు కొనసాగించాలని సూచించారు. ఏదైనా సమాచారం కోసం ఖమ్మం రైల్వేస్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande