వైకాపా.నేత.మాజీ. ఎమ్మేల్యే. వల్లభనేని.వంశీ బెయిల్.పిటిషన్ వాయిదా
విజయవాడ, 6 మార్చి (హి.స.) విజయవాడ: వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. వంశీకి బెయిల్‌ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) వాద
వైకాపా.నేత.మాజీ. ఎమ్మేల్యే. వల్లభనేని.వంశీ బెయిల్.పిటిషన్ వాయిదా


విజయవాడ, 6 మార్చి (హి.స.)

విజయవాడ: వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. వంశీకి బెయిల్‌ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) వాదించారు. పోలీసు కస్టడీలో విచారించిన సమయంలో కీలక సమాచారం తెలిసిందన్నారు.

వంశీ ఆదేశాలతోనే సత్యవర్ధన్‌ను కలిసినట్లు మరో ఇద్దరు నిందితులు విచారణలో అంగీకరించారని కోర్టుకు పీపీ తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. మరింత సమాచారం రాబట్టేందుకు వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌ వేసినట్లు కోర్టుకు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande