ప్యాకేజీ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల బాధితుల నిరసన
తెలంగాణ, మహబూబ్నగర్. 6 మార్చి (హి.స.) పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్యాకేజీ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని జడ్చర్ల మండలం ఉదండాపూర్ నిర్వాసితులు ఇవాళ ప్రాజెక్టు పనులను అడ్డుకొని దీక
ప్రాజెక్టు బాధితుల నిరసన


తెలంగాణ, మహబూబ్నగర్. 6 మార్చి (హి.స.)

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్యాకేజీ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని జడ్చర్ల మండలం ఉదండాపూర్ నిర్వాసితులు ఇవాళ ప్రాజెక్టు పనులను అడ్డుకొని దీక్ష చేపట్టారు.

అధికారులు సర్వే చేపట్టి వారం రోజులైనా పరిహారం డబ్బులు చెల్లించక పోగా.. 21 ఏండ్లు నిండి పెండ్లి అయిన యువకుల కుటుంబాలకు పరిహారం ఇవ్వటం లేదని ఆరోపిస్తూ యువకులు ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనులను అడ్డుకొని అక్కడే బైఠాయించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande