కేంద్రాన్ని ఉద్దేశించి స్టాలిన్‌ మరో పోస్ట్‌
చెన్నై 6 మార్చి (హి.స.)తాము భాషా సమానత్వాన్ని (3-Language Policy) కోరుకుంటున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) అన్నారు. తమిళనాడులో తమిళానికి ప్రాధాన్యం కల్పించమని అడిగితే దానిని దురభిమానం అనే ముద్ర వేస్తున్నారని విమర్శించారు. కేంద్
కేంద్రాన్ని ఉద్దేశించి స్టాలిన్‌ మరో పోస్ట్‌


చెన్నై 6 మార్చి (హి.స.)తాము భాషా సమానత్వాన్ని (3-Language Policy) కోరుకుంటున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) అన్నారు. తమిళనాడులో తమిళానికి ప్రాధాన్యం కల్పించమని అడిగితే దానిని దురభిమానం అనే ముద్ర వేస్తున్నారని విమర్శించారు. కేంద్ర నూతన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తూ తాజాగా మరోసారి ఎక్స్‌ వేదికగా ఆయన పోస్టు పెట్టారు.

జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు- కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నూతన విద్యావిధానం ద్వారా హిందీని బలవంతంగా రుద్దుతున్నారంటూ.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేశారని స్టాలిన్‌ ప్రభుత్వం కేంద్రంపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. భాషలను రాజకీయ కోణంలో చూడవద్దంటూ కేంద్రాన్ని కోరింది. ఈనేపథ్యంలోనే ఆయన మరో పోస్టు పెట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande