తేజస్‌ విమానాల్లో విజయవంతంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి వ్యవస్థల పరీక్ష
దిల్లీ:, 6 మార్చి (హి.స.) గగనతలంలో అత్యంత ఎత్తుకు వెళ్లే యుద్ధ విమానాల్లో పైలట్లు ఆక్సిజన్‌ కోసం సంప్రదాయ సిలిండర్లపై ఆధారపడడాన్ని తగ్గించి...లోహ విహంగంలోనే ప్రాణవాయువును ఉత్పత్తి చేసే వ్యవస్థ(ఓబీఓజీఎస్‌)ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆరోడీవో)
తేజస్‌ విమానాల్లో విజయవంతంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి వ్యవస్థల పరీక్ష


దిల్లీ:, 6 మార్చి (హి.స.) గగనతలంలో అత్యంత ఎత్తుకు వెళ్లే యుద్ధ విమానాల్లో పైలట్లు ఆక్సిజన్‌ కోసం సంప్రదాయ సిలిండర్లపై ఆధారపడడాన్ని తగ్గించి...లోహ విహంగంలోనే ప్రాణవాయువును ఉత్పత్తి చేసే వ్యవస్థ(ఓబీఓజీఎస్‌)ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆరోడీవో) సొంతంగా రూపొందించింది.

ఓబీఓజీఎస్‌ పనితీరును ఈ నెల 4న తేజస్‌ యుద్ధ విమానాల్లో పరీక్షించగా విజయవంతమైందని రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. కొన్ని మార్పులు చేర్పులతో ఓబీఓజీఎస్‌ను మిగ్‌-29కె, ఇతర యుద్ధ విమానాల్లోనూ ప్రవేశపెడతామని తెలిపింది. సముద్ర మట్టం నుంచి 50వేల అడుగుల ఎత్తు, అంతకంటే దిగువ స్థాయిల్లోనూ గగనతల విన్యాసాలు నిర్వహించి ఓబీఓజీఎస్‌ను పరీక్షించగా అన్ని పరామితుల్లోనూ ఈ వ్యవస్థ సఫలతను సాధించిందని రక్షణ శాఖ వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande