ఉచిత బస్సు ప్రయాణానికి కండిషన్లు విధించడంపై ఎపి పిసిపి అధ్యక్షరాలు షర్మిల ఆగ్రహం
ఏ.పీ, వెలగపూడి. 7 మార్చి (హి.స.) ఉచిత బస్సు ప్రయాణానికి కండిషన్లు విధించడంపై ఎపి పిసిపి అధ్యక్షరాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఏ జిల్లా మహిళలు ఆ జిల్లాలోనే ఉచితంగా ప్రయాణించేందుకు అర్హులు అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశా
షర్మిల ఆగ్రహం


ఏ.పీ, వెలగపూడి. 7 మార్చి (హి.స.) ఉచిత బస్సు ప్రయాణానికి కండిషన్లు విధించడంపై ఎపి పిసిపి అధ్యక్షరాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఏ జిల్లా మహిళలు ఆ జిల్లాలోనే ఉచితంగా ప్రయాణించేందుకు అర్హులు అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు...ఈ మేరకు ఆమె తన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు. ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్న... ఏరు దాటాక బోడి మల్లన్నలా కూటమి ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ఊదరగొట్టి ఓట్లు వేయించుకున్నారని, ఇప్పుడు కండిషన్ అప్లై అనడం దారుణం అని షర్మిల విమర్శించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande