గుంటూరు 7 మార్చి (హి.స.)నాగార్జున వర్సిటీ పరిధిలోని బీఎడ్ కళాశాలలో జరుగుతున్న మొదటి సెమిస్టర్ ప్రశ్నపత్రం అరగంట ముందుగానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. గుంటూరు జిల్లాలోని డెల్టా ప్రాంతానికి చెందిన ఓ కళాశాల యాజమాన్యం ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 6 నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిన్నటి ప్రశ్నపత్రం కూడా అరగంట ముందుగానే బయటకు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై ఏఎన్‌యూ పీజీ పరీక్షల సమన్వయకర్త ఆచార్య సుబ్బారావును వివరణ కోరగా.. వివరాలు తెలియవని చెప్పారు. అరగంట ముందు సీడీ ద్వారా ప్రశ్నపత్రం రిలీజ్ చేశారని.. అది ఎలా బయటకు వెళ్లిందో తెలియదని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల