బెంగళూరు 7 మార్చి (హి.స.)
: భారతీయ జనతా పార్టీ (బీజేపి) ఎంపి తేజస్వి సూర్య గురువారం ప్రఖ్యాత కర్ణాటక గాయకురాలు శివశ్రీ స్కందప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు. ఈ ప్రైవేట్ వేడుకలో దగ్గరి కుటుంబ సభ్యులు, అన్నామలై, ప్రతాప్ సింహా, అమిత్ మాలవ్య వంటి ముఖ్య రాజకీయ నేతలు హాజరయ్యారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర, కేంద్రమంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, వి. సోమన్న కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ పంచుకోవడంతో వైరల్‌గా మారాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల