చెన్నై , 7 మార్చి (హి.స.)శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్పై విమర్శలు గుప్పించారు. ఎల్కేజీ స్టూడెంట్.. పీహెచ్ డీ హోల్డర్ కు బోధించినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. తమిళ భాష కోసం ముఖ్యమంత్రిగా స్టాలిన్ చేసింది ఏమీలేదన్నారు. ప్రాంతీయ భాషలకు అనుగుణంగా కీలక మార్పులు చేసింది ప్రధాని మోడీ ప్రభుత్వమేనన్నారు.
ఇప్పటి వరకు సీఏపీఎఫ్ నియామకాల్లో మాతృభాషకు స్థానం లేదన్నారు. కానీ యువత భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఎనిమిదవ షెడ్యూల్లో మార్పులు చేశామని.. దీంతో సీఏపీఎఫ్ పరీక్షను ఇప్పుడు తమిళంలో కూడా రాయగల్గుతున్నారని పేర్కొన్నారు. స్టాలిన్.. ప్రాంతీయ భాషకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని అడిగారు. వైద్య, ఇంజనీరింగ్ కోర్సుల పాఠ్యాంశాలను వీలైనంత త్వరగా తమిళ భాషలో ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను కోరుతున్నట్లు అమిత్ షా తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..