తెలంగాణ, జనగామ. 7 మార్చి (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 16న జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి రానున్నారు. సీఎం రాక సందర్భంగా నియోజకవర్గంలో విస్తృత మైన ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాగా ఈ ఏడాదికాలంలోనే నియోజకవర్గ అభివృద్ధి కోసం 800 కోట్ల రూపాయల నిధులను తీసుకురావడం జరిగిందని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శంకుస్థాపన చేయనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్