ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ రద్దు చేసిన ప్రభుత్వం మోదీది.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ, హైదరాబాద్. 7 మార్చి (హి.స.) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళను శక్తిగా కొలిచే
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి


తెలంగాణ, హైదరాబాద్. 7 మార్చి (హి.స.)

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళను శక్తిగా కొలిచే సంప్రదాయం ఒక్క భారత్లోనే ఉందని అన్నారు. పార్టీలో ఎలాంటి బాధ్యతలు ఇచ్చిన అద్భుతంగా మహిళా మోర్చా నేతలు పని చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మహిళలు బాగా పని చేశారు.. దేశ సరిహద్దుల్లో రక్షణ విభాగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యధిక మహిళా పైలట్లు ఇండియాలో ఉన్నారు.. ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ రద్దు చేసిన ప్రభుత్వం మోదీది అని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రసూతి సెలవులు 26 వారాలకు పొడిగించిన ఘనత మోదీ సర్కారి అన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు బిల్లునే ఆమోదించారని పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande