హైదరాబాద్, 7 మార్చి (హి.స.) హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన పిల్లల అక్రమ రవాణా వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారి వందన అనే మహిళను అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాదులో అమ్మినట్లు గుర్తించారు. హైదరాబాదులోని నలుగురు బ్రోకర్లకి నలుగురు పిల్లలని వందన అమ్మినట్లు విచారణలో తేలింది. అహ్మదాబాద్ కు చెందిన వందనను రాచకొండ పోలీసులు హైదరాబాద్ కు తీసుకొచ్చి రిమాండ్ చేశారు. వందనను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..