శ్రీశైలం జలాశయంలో. ఫ్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన భారీ.గొయ్యి. డ్యాం భద్రతకు.పెనుప్రమాదం.పొంచివుంది
విజయవాడ, 7 మార్చి (హి.స.)శ్రీశైలం జలాశయంలో ప్లంజ్‌పూల్‌ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి డ్యాం భద్రతకు పెను ప్రమాదంగా మారిందని కేంద్ర జల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి మరమ్మతులు చేపట్టకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర జల సంఘం ని
శ్రీశైలం జలాశయంలో. ఫ్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన భారీ.గొయ్యి. డ్యాం భద్రతకు.పెనుప్రమాదం.పొంచివుంది


విజయవాడ, 7 మార్చి (హి.స.)శ్రీశైలం జలాశయంలో ప్లంజ్‌పూల్‌ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి డ్యాం భద్రతకు పెను ప్రమాదంగా మారిందని కేంద్ర జల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి మరమ్మతులు చేపట్టకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర జల సంఘం నిలదీసింది. రూ. 480 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణంతో శ్రీశైలం ప్లంజ్‌పూల్‌‌తో పాటు గుండ్లకమ్మ, రైవాడ, ధవళేశ్వరం ప్రాజెక్ట్‌ల మరమ్మతులపై కదలిక లేకపోవడంతో గురువారం ఆంధ్ర, తెలంగాణ అధికారులతో కేంద్ర జల సంఘం అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande