తెలంగాణ, 7 మార్చి (హి.స.) మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం ఆయన పేరును ఓ యూనివర్సిటీకి పెట్టారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని బెంగళూరు సెంట్రల్ యూనివర్సిటీ కి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని ఆ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ స్వయంగా అసెంబ్లీలో శుక్రవారం ప్రకటించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2024 డిసెంబర్ 26న తుది శ్వాస విడిచారు. ఆయన మరణం తర్వాత దేశంలో ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం ఇదే తొలిసారి. బెంగళూరు సెంట్రల్ యూనివర్సిటీని 2017లో స్థాపించారు. 2024లో తన 92వ ఏట కన్ను మూసిన మన్మోహన్ సింగ్ను ఆధునిక ఆర్థిక సంస్కరణల రూపకర్తగా కీర్తిని సంపాదించారు. భారతదేశానికి ఆయన 13వ ప్రధానిగా పనిచేశారు. ఆయన 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా కొనసాగారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్