కృష్ణా. జిల్లా లోని..మెయిలవరంలో ఫ్రిడ్జ్ పేలుడు కలకలం రేపింది
విజయవాడ, 7 మార్చి (హి.స.), జిల్లాలోని మైలవరంలో ఫ్రిడ్జ్ () పేలుడు కలకలం రేపింది. ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున భారీ శబ్ధంతో ఫ్రిడ్జ్ పేలిపోయింది. పేలుడు ధాటికి ఇంట్లోని కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. అయితే ఇంట్లోని వారు వేరు రూంలో ఉండటంతో పెను ప్
కృష్ణా. జిల్లా లోని..మెయిలవరంలో ఫ్రిడ్జ్ పేలుడు కలకలం రేపింది


విజయవాడ, 7 మార్చి (హి.స.), జిల్లాలోని మైలవరంలో ఫ్రిడ్జ్ () పేలుడు కలకలం రేపింది. ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున భారీ శబ్ధంతో ఫ్రిడ్జ్ పేలిపోయింది. పేలుడు ధాటికి ఇంట్లోని కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. అయితే ఇంట్లోని వారు వేరు రూంలో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో ఇంట్లో నిద్రిస్తున్న వారు భయాందోళనకు గురయ్యారు. కాసేపు ఏం జరిగిందో తెలియక అయోమయానికి గురయ్యారు. తీరా ఫ్రిడ్జ్ పేలిందని తెలిసి షాక్‌కు గురయ్యారు. అయితే వేరే రూంలో నిద్రిస్తుండటంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande