బెంగళూరు 7 మార్చి (హి.స) సినిమా ప్రేక్షకులకు కర్ణాటక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26కు సంబంధించిన కర్ణాటక బడ్జెట్ను నేడు ప్రవేశపెట్టగా.. ఈ బడ్జెట్లో సినీ రంగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంది. బడ్జెట్లో భాగంగా.. రాష్ట్రంలోని అన్ని మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో సినిమా టికెట్ ధరను రూ.200కి పరిమితం చేస్తున్నట్లు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం.. మల్టీప్లెక్స్లో సాధారణ సీట్లకు టికెట్ ధర రూ.200 దాటకూడదు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..