ఏ.పీ, విజయవాడ, 7 మార్చి (హి.స.)
అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచుతూ జీవో జారీ చేసింది. అలాగే రిటైర్మెంట్ తరువాత గ్రాట్యుటీని కూడా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈరోజు జీఓ నెంబర్ 8ని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి జారీ చేశారు. ఈ జివో ప్రకారం అంగన్వాడీ హెల్పర్లకు 1 లక్ష రూపాయలు, వర్కర్లకు 40 వేల గ్రాట్యుటీ చెల్లించాలని నిర్ణయించింది. సర్కార్ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో 1 లక్ష 20 వేల మందికి లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం నిర్ణయంతో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..