21వ జాతీయ స్థాయి ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్ సీవీ అనంద్
తెలంగాణ, 7 మార్చి (హి.స.) హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో 21వ జాతీయ స్థాయి ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ క్లబ్లో ప్రారంభం అయ్యాయి. నగర పోలీస్ కమిషనర్ సీవీ అనంద్ ఈ టోర్
నగర పోలీస్ కమిషనర్ సీవీ అనంద్


తెలంగాణ, 7 మార్చి (హి.స.)

హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో 21వ జాతీయ స్థాయి ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ క్లబ్లో ప్రారంభం అయ్యాయి. నగర పోలీస్ కమిషనర్ సీవీ అనంద్ ఈ టోర్నమెంట్ను ప్రారంభించారు. హైదరాబాద్లో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన 425 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో టెన్నిస్ క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించేందుకు 21 ఏళ్ల క్రితం హైద్రాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ ప్రారంభించమన్నారు. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు వచ్చి ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. ఇలాంటి టోర్నమెంట్స్ స్థానిక ఆటగాళ్లకు మంచి అనుభవం వస్తుందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande