అర్ధరాత్రి అక్రమ మట్టి దందాకు వ్యక్తి బలి.. మెదక్ జిల్లాలో ఘటన..
తెలంగాణ, మెదక్. 7 మార్చి (హి.స.) అర్థరాత్రి సాగుతున్న అక్రమ మట్టి దందాకు టిప్పర్ లో ఉన్న వ్యక్తి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు హవేలీ ఘనపూర్ శివారులో గత వారం రోజులుగా అనుమ
ఇసుక దందా


తెలంగాణ, మెదక్. 7 మార్చి (హి.స.)

అర్థరాత్రి సాగుతున్న అక్రమ మట్టి దందాకు టిప్పర్ లో ఉన్న వ్యక్తి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు హవేలీ ఘనపూర్ శివారులో గత వారం రోజులుగా అనుమతి లేని అక్రమ మట్టి దందా సాగుతుంది. గురువారం రాత్రి మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ హవేలీ ఘనపూర్ స్మశాన వాటిక వద్ద వేగంగా వచ్చి కమాన్ ను ఢీ కొట్టడంతో అందులో ఉన్న మాంబోజి పల్లికి చెందిన సొహెల్ (20) కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అర్థరాత్రి కావడం ముందు ఉన్న కమాన్ ను గుర్తించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande