కార్యాలయాల నుంచి మరింత మంది ఉద్యోగులు పనిచేసేలా.చూసేందుకు ఐతే.దిగ్గజం ఇన్ఫోసిస్ చర్యలు
దిల్లీ 7 మార్చి (హి.స.): కార్యాలయాల నుంచి మరింత మంది ఉద్యోగులు పనిచేసేలా చూసేందుకు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ చర్యలు తీసుకుంటోంది. నెలలో కనీసం 10 రోజుల పాటు ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసు నుంచే పనిచేసే విధంగా చూడాలని టెక్నాలజీ టీమ్‌ను ఇన్ఫోసిస్‌ తాజాగా ఆదేశ
కార్యాలయాల నుంచి మరింత మంది ఉద్యోగులు పనిచేసేలా.చూసేందుకు ఐతే.దిగ్గజం ఇన్ఫోసిస్ చర్యలు


దిల్లీ 7 మార్చి (హి.స.): కార్యాలయాల నుంచి మరింత మంది ఉద్యోగులు పనిచేసేలా చూసేందుకు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ చర్యలు తీసుకుంటోంది. నెలలో కనీసం 10 రోజుల పాటు ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసు నుంచే పనిచేసే విధంగా చూడాలని టెక్నాలజీ టీమ్‌ను ఇన్ఫోసిస్‌ తాజాగా ఆదేశించింది. ఈ నెల 10 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌ ఉద్యోగులు మొబైల్‌ యాప్‌ ద్వారా తమ హాజరు వివరాలను నమోదు చేస్తున్నారు. ఇకపై వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అభ్యర్థనలను నేరుగా యాప్‌లో ఆమోదించరు. ప్రతి ఉద్యోగి నెలలో కనీసం 10 రోజులు కార్యాలయాలకు వచ్చే విధంగా మార్పులు చేపట్టనున్నారు. ఉద్యోగులకు కొత్త హైబ్రిడ్‌ పని పద్ధతులతో ఈ వ్యవస్థను అమలు చేస్తారు. ఒకవేళ నెలలో కార్యాలయానికి రావాల్సిన రోజుల్లో ఒకటి లేదా రెండు రోజులు తగ్గితే.. వాటిని ఉద్యోగి సెలవుల నుంచి మినహాయిస్తారు. దీనిపై ఇన్ఫోసిస్‌ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande