తమిళనాడు. 7 మార్చి (హి.స.)
డీలిమిటేషన్కి వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)ని ఏర్పాటు చేయబోతున్నట్టు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. దీనికి సంబంధించిన సమావేశం మార్చి 22న చెన్నైలో జరగనుంది. ఈ సమావేశానికి ఏడుగురు రాష్ట్ర నాయకులను స్టాలిన్ చెన్నైకి ఆహ్వానించారు. ఆహ్వానం అందుకున్న వారిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మారీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీల, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి ఉన్నారు. ఈ మేరకు ఆయన ఏడుగురు ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. వీరంతా జేఏసీలో చేరాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..