దిల్లీ: 7 మార్చి (హి.స.)కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం గురువారం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అభయ్ ఎస్.ఓక్, జస్టిస్ విక్రంనాథ్ కొలీజియం ఈ మేరకు ప్రకటించింది. దీనిని కేంద్రప్రభుత్వం ఆమోదిస్తే జస్టిస్ బాగ్చీ ఆరేళ్లకు పైబడి సుప్రీంకోర్టులో సేవలందించడంతోపాటు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం పొందుతారు. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా కొద్ది కాలం పనిచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు