తెలంగాణ ఎర్రవల్లి, 7 మార్చి (హి.స.)
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, పార్టీ భవిష్యత్ కార్యచరణపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు సమాచారం.
రజతోత్సవ వేడుకలపై పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఏప్రిల్ 27న జరగబోయే బహిరంగ సభపై పార్టీ నేతలతో కేసీఆర్ సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆవిర్భావ రజతోత్సవ వేడుకలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఎర్రెవల్లిలోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ సన్నాహక సమావేశానికి కేటీఆర్, హరీశ్రావు, మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, కేఆర్ సురేశ్, బండా ప్రకాశ్, సబితా ఇంద్రారెడ్డి, కవిత, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వినోద్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేశపతి శ్రీనివాస్, శేరి సుభాష్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..