ప్రజల సమస్యల పరిష్కారంలో ముందు ఉంటా.. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
తెలంగాణ, హైదరాబాద్. 7 మార్చి (హి.స.) ప్రజల సమస్యల పరిష్కారంలో ముందు ఉంటానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చైతన్యపురి డివిజన్కు చెందినా కాలనీవాసులు బీఆర్ఎస్ నాయకుడు చంద
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి


తెలంగాణ, హైదరాబాద్. 7 మార్చి (హి.స.)

ప్రజల సమస్యల పరిష్కారంలో ముందు ఉంటానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చైతన్యపురి డివిజన్కు చెందినా కాలనీవాసులు బీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి అధ్వర్యంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిశారు.

ఈ సందర్భబంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ప్రణాలికా బద్దంగా పరిష్కారం చేస్తామన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామన్నారు. న్యూదిల్ సుఖ్ నగర్ కాలనీ సభ్యులతో కలిసి కాలనీ రోడ్ల సమస్యల గురించి, ద్వారకాపురం రోడ్ల సమస్యల గురించి, మహిళా దినోత్సవ కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే చర్చించడం జరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande