మార్చి 1 న బిజాపూర్ సుక్మా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ వట్టి బూటకం.. మావోయిస్టు పార్టీ డివిజనల్ కార్యదర్శి గంగ.
భద్రాచలం, 7 మార్చి (హి.స.) మార్చి 1 న బిజాపూర్ సుక్మా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ వట్టి బూటకం అని మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్ డివిజనల్ కార్యదర్శి గంగ ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఒక లేఖను విడుదల చేశారు. పీఏఎంఎస్ ఏరియా కమిటీ సోడి లింగే, పోడియం హరమా
మావోయిస్టు పార్టీ


భద్రాచలం, 7 మార్చి (హి.స.)

మార్చి 1 న బిజాపూర్ సుక్మా

సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ వట్టి బూటకం అని మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్ డివిజనల్ కార్యదర్శి గంగ ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఒక లేఖను విడుదల చేశారు. పీఏఎంఎస్ ఏరియా కమిటీ సోడి లింగే, పోడియం హరమా సీనియర్ ఎసీ సభ్యులను భద్రతా బలగాలు అరెస్ట్ చేసి విచక్షణా రహితంగా చంపారని లేఖలో ఆరోపించారు. ముగ్గురు నక్సలైట్లను పోలీసులు పట్టుకుని పామేడ్ పోలీస్ స్టేషన్లో బంధించి హింసకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande