వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగింది, మంత్రి సత్య ప్రసాద్.
ఏ.పీ, అమరావతి. 7 మార్చి (హి.స.) వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగి, చాలా సమస్యలు తలెత్తాయని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి సత్య ప్రసాద్ తెలిపారు. జిల్లాల పునర్విభజనపై మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు ఇవా
మంత్రి సత్య ప్రసాద్.


ఏ.పీ, అమరావతి. 7 మార్చి (హి.స.)

వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల

పునర్విభజన అశాస్త్రీయంగా జరిగి, చాలా సమస్యలు తలెత్తాయని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి సత్య ప్రసాద్ తెలిపారు. జిల్లాల పునర్విభజనపై మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు ఇవాళ మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాల పునర్నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిశీలనలో ఎటువంటి ప్రతిపాదనలు లేవన్నారు. బాపట్ల, చీరాల, రేపల్లె అనే మూడు రెవెన్యూ డివిజన్లను సవరించి అద్దంకి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం బాపట్ల కలెక్టర్ నుంచి ప్రతిపాదన వచ్చిందన్నారు. అదేవిధంగా మడకశిరను కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించారని తెలిపారు. ఈ రెండు ప్రతిపాదనలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande