విశాఖ టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్, సీఐడీ విచారణ, మంత్రి నారాయణ
ఏ.పీ, అమరావతి. 7 మార్చి (హి.స.) విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్, సీఐడీ విచారణ జరుగుతుందని, వారి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగూరి నారాయణ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చా
మంత్రి నారాయణ


ఏ.పీ, అమరావతి. 7 మార్చి (హి.స.)

విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్, సీఐడీ విచారణ జరుగుతుందని, వారి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగూరి నారాయణ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయన్నారు. విశాఖలోనే కాదని తణుకు, తిరుపతిలో కూడా అక్రమాలు జరిగాయని తెలిపారు. తణుకులో రూ.63.24 కోట్ల విలువ ఉన్న చోట రూ.754 కోట్ల బాండ్లు జారీ చేశారని తెలిపారు. రూరల్ ఏరియాలో భూమి తీసుకుని పట్టణంలో ఉన్న ఇంటి వాల్యూతో బాండ్లు ఇచ్చారని పేర్కొన్నారు. తిరుపతిలో 170.99 కోట్లకు 29 బాండ్లు జారీ చేశారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం 965, విశాఖలో 266 టీడీఆర్ బాండ్లు పెండింగ్ లో ఉన్నాయని, మూడు నెలల లోగా బాండ్ల అక్రమాలపై స్పష్టత వస్తుందని నారాయణ పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande