తెలంగాణ, ఖమ్మం. 7 మార్చి (హి.స.)
కూసుమంచి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తో కలిసి శుక్రవారం జెఎస్ మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వారితో చేపల అమ్మకం, మొబైల్ రెస్టారెంట్ లో చేసే పలు స్నాక్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా వారితో మాట్లాడుతూ ఈ సారి నేను కలెక్టర్ తో వచ్చి మీ మొబైల్ రెస్టారెంట్ వద్ద స్నాక్స్ రుచి చూస్తామని వారితో అన్నారు. మత్స్యకార సంఘ మహిళా గ్రూపునకు 10 లక్షల విలువ గల మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ ను ఆరు లక్షల సబ్సిడీతో ఇచ్చారు. కాగా మిగతా నాలుగు లక్షలు డ్వాక్రా సంఘం ద్వారా ఋణం మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో కూసుమంచి, తిరుమలాయ పాలెం మండలాలకు చెందిన 79 కల్యాణలక్ష్మి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్