నన్ను మేడం అని పిలవవద్దు.. నేను మీ భువనమ్మను.. నారా భువనేశ్వరి.
ఏ.పీ, 7 మార్చి (హి.స.) నన్ను మేడం అని పిలవవద్దు.. నేను మీ భువనమ్మను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి.. నారా భువనేశ్వరి.. తాను దత్తత తీసుకున్న కృష్ణా జిల్లా కొమరువోలు గ్రామంలో ఈ రోజు పర్యటించిన ఆమ
నారా భువనేశ్వరి.


ఏ.పీ, 7 మార్చి (హి.స.)

నన్ను మేడం అని పిలవవద్దు..

నేను మీ భువనమ్మను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి.. నారా భువనేశ్వరి.. తాను దత్తత తీసుకున్న కృష్ణా జిల్లా కొమరువోలు గ్రామంలో ఈ రోజు పర్యటించిన ఆమె.. గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నన్ను మేడం అని పిలవవద్దు.. నేను మీ భువనమ్మను అని వ్యాఖ్యానించారు.. ఇక, కొమరవోలు రావడం సంతోషంగా ఉందన్న ఆమె.. ఈ గ్రామాన్ని ఎప్పుడూ మర్చిపోను.. ప్రజలు చిన్న చిన్న సమస్యలు నా దృష్టికి తెచ్చారు.. ఇచ్చిన హామీలతో పాటు సమస్యలన్నింటిని.. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కరిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. గ్రామంలో విభేదాలు ఉంటే మాట్లాడుకొని పరిష్కరించాలి... వర్గాలను పక్కన పెట్టండి. గ్రామస్తులందరూ కుటుంబం మాదిరి కలిసి ఉండండి అని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande