పదివేల స్కూళ్లలో వన్ క్లాస్ వన్ టీచర్ విధానం.. మంత్రి నారా లోకేశ్
ఏ.పీ, అమరావతి.7 మార్చి (హి.స.) ఏపీలో పదివేల స్కూళ్లలో వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని తీసుకువస్తామని ఐటీ, విద్యశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ రోజు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కేవలం 1400 పాఠశాలల్లోనే వన్ క్లాస్ వన
మంత్రి నారా లోకేశ్


ఏ.పీ, అమరావతి.7 మార్చి (హి.స.)

ఏపీలో పదివేల స్కూళ్లలో వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని

తీసుకువస్తామని ఐటీ, విద్యశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ రోజు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కేవలం 1400 పాఠశాలల్లోనే వన్ క్లాస్ వన్ టీచర్ విధానం ఉందన్నారు. రాబోయే రోజుల్లో పదివేల స్కూళ్లలో ఈ విధానాన్ని తీసుకువస్తామన్నారు. విద్యార్థుల డ్రాపవుట్స్ తగ్గించేందుకు ప్రయత్నిస్తామన్నారు. అమరావతిలో ప్రపంచస్థాయి టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను తీసుకువస్తామన్నారు. త్వరలో టీచర్ల సీనియారిటీ జాబితా విడుదల చేస్తామన్నారు. విద్యావ్యవస్థలో టీచర్ల పాత్ర కీలకమైనదని, వారిపై భారం ఉంటే పని చేయలేరని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande