లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేసే బ్యాంకుల పై క్రిమినల్ చర్యలు.. రాజేంద్ర సిరిసిల్ల జిల్లా కలెక్టర్ హెచ్చరిక.
తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 7 మార్చి (హి.స.) ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
కలెక్టర్ హెచ్చరిక


తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 7 మార్చి (హి.స.)

ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే సామాజిక పింఛన్లను కొన్ని బ్యాంకులు వివిధ రుణాల కింద జమ చేసుకుంటున్నట్లు సమాచారం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం అందించే పథకాల సొమ్మును రుణాల కింద జమ చేసుకో వడానికి వీలు లేన్నారు. వెంటనే సంబంధిత లబ్దిదారులకు ఆ సొమ్మును చేర వేయాలని, లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేసే బ్యాంకుల పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande