ఈడీ అధికారాలను సమర్థించిన తీర్పు పునఃసమీక్షపై నిర్ణయం ఏప్రిల్‌లో
దిల్లీ:, 7 మార్చి (హి.స.)మనీ లాండరింగ్‌ చట్టం కింద వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు వారి ఆస్తుల జప్తు అధికారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కు అప్పగించడాన్ని సమర్థించిన 2022 తీర్పును పునఃసమీక్షించడంపై ఏప్రిల్‌లో నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకో
ఈడీ అధికారాలను సమర్థించిన తీర్పు పునఃసమీక్షపై నిర్ణయం ఏప్రిల్‌లో


దిల్లీ:, 7 మార్చి (హి.స.)మనీ లాండరింగ్‌ చట్టం కింద వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు వారి ఆస్తుల జప్తు అధికారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కు అప్పగించడాన్ని సమర్థించిన 2022 తీర్పును పునఃసమీక్షించడంపై ఏప్రిల్‌లో నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది. పునఃసమీక్ష కోరుతూ దాఖలైన పిటిషన్‌ వాస్తవానికి త్రిసభ్య ధర్మాసనం ముందుకు వెళ్లాలని, పొరపాటున తమ వద్దకు వచ్చిందని జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌ సభ్యులుగా ఉన్న ద్విసభ్య ధర్మాసనం గురువారం వెల్లడించింది. కేంద్రం తరఫున హాజరైన తుషార్‌ మెహతా...ధర్మాసనం అభిప్రాయంతో ఏకీభవిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్‌ నెలాఖరుకు లేదా మే మొదటి వారానికి వాయిదా వేయాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande