జ్వరం తగ్గేంతవరకు అసెంబ్లీకి రాకండి.. మంత్రి రామానాయుడు కి డిప్యూటీ స్పీకర్ విజ్ఞప్తి..
ఏ.పీ, అమరావతి. 7 మార్చి (హి.స.) ఏపీ అసెంబ్లీలో ఈ రోజు ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది. శాసనసభకు ఈ రోజు మంత్రి రామానాయుడు చేతికి క్యానులా పెట్టుకుని వచ్చారు. దీనిని గమనించిన మంత్రి లోకేశ్ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పని చేస్తానంటే.. సస్పెండ్ చేస్తా అని
మంత్రి లోకేష్


ఏ.పీ, అమరావతి. 7 మార్చి (హి.స.)

ఏపీ అసెంబ్లీలో ఈ రోజు ఆసక్తి

పరిణామం చోటు చేసుకుంది. శాసనసభకు ఈ రోజు మంత్రి

రామానాయుడు చేతికి క్యానులా పెట్టుకుని వచ్చారు. దీనిని గమనించిన మంత్రి లోకేశ్ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పని చేస్తానంటే.. సస్పెండ్ చేస్తా అని మంత్రి నిమ్మల రామానాయుడును ఉద్దేశించి సరదాగా అన్నారు., అన్నకు బాగోలేదు అయినా అసెంబ్లీకి వచ్చేస్తున్నారు. చెప్పినా వినడం లేదు. మీరైనా రూలింగ్ ఇవ్వండి అధ్యక్షా అని కోరారు. స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు

దీనిపై స్పందించారు.

రామానాయుడు పని రాక్షసుడు.. ప్రజాసేవతో పాటు మీ ఆరోగ్యం కూడా చూసుకోండి. జ్వరం తగ్గేవరకు

అసెంబ్లీకి రావద్దు. ఇది నా రూలింగ్ అని అన్నారు.

బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ జ్వరం అని నాకు తెలియదు.. రామానాయుడు నాకు చాలా కాలంగా తెలుసు మా ఊరు పక్కవాడే. పట్టుదల మనిషి అని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande