పర్యావరణ హితాన్ని కోరి ప్రతి ఒక్కరూ జ్యూట్ బ్యాగులు వినియోగించాలి.. వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద
తెలంగాణ, వరంగల్. 7 మార్చి (హి.స.) పర్యావరణ హితాన్ని కోరి ప్రతి ఒక్కరూ జ్యూట్ బ్యాగులు వినియోగించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అన్నారు. శుక్రవారం వరంగల్ స్టేషన్ రోడ్డులోని ఎం.కె. నాయుడు హోటల్లో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్ట్ టైల్స్ గవర్నమెంట్ ఆఫ్
వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద


తెలంగాణ, వరంగల్. 7 మార్చి (హి.స.) పర్యావరణ హితాన్ని కోరి ప్రతి ఒక్కరూ జ్యూట్ బ్యాగులు వినియోగించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అన్నారు. శుక్రవారం వరంగల్ స్టేషన్ రోడ్డులోని ఎం.కె. నాయుడు హోటల్లో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్ట్ టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారం తో జ్యూట్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన జ్యూట్ మార్క్ ఇండియా స్కీమ్ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణానికి, మానవ మనుగడకు హాని కలిగించని విధంగా ప్రమాణాలకు లోబడి తయారు చేయబడిన జనపనార వస్తువులకు జ్యూట్ మార్క్ ఇండియా ముద్రించబడి ఉంటుందన్నారు. అనంతరం జ్యూట్ తో తయారు చేసిన వస్తువులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కలెక్టర్ సందర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande