హైదరాబాద్, 7 మార్చి (హి.స.)తెలంగాణ రాష్ట్రంలోని టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్. పదవ తరగతి పరీక్షలు రాస్తున్న వారు ఈరోజు (శుక్రవారం) నుంచి వెబ్ సైట్‌లో తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 21వ తేదీ నుంచి పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇవాళ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారులు పెట్టనున్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 10వ తరతగతి పరీక్షలు జరగనున్నాయి.
4
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల