ఏ.పీ, 7 మార్చి (హి.స.)
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని అనుచరులకు పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, గొర్ల శ్రీనుకి నోటీసులు అంజేశారు. వలంటీర్ల బలవంతపు రాజీనామా, లిక్కలరోదాం కేసుల్లో ఈ ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు ఘటనలపై కొడాలి నాని, బేవరేజెస్మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నమోదైంది. ఇదే కేసులో అప్పటి జేసీ మాధవీలతారెడ్డి సహా పలువురిపై కేసు నమోదైంది. తనకు చెందిన ఏపీ బేవరేజెస్ గోడౌనును రెండేళ్ల కాలపరిమితి ఉన్నా దానిని తరలించేందుకు ప్రయత్నించారని గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్అనే వ్యక్తి గత ఏడాది ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇదే ఆరోపణలపై నానికి అనుచరులకు నోటీసులివ్వడం కలకలం రేపింది. వీరిని విచారించిన అనంతరం నానిపైనా కేసు నమోదు చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..