రన్యారావ్‌ పాత్రధారి మాత్రమే-బంగారం రవాణా కింగ్‌పిన్‌ వేరే
బెంగళూరు , 7 మార్చి (హి.స.) బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. కిలో బంగారం రవాణాకు రన్యారావ్‌కు రూ.5 లక్షల కమీషన్‌ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నటి పాత్రధారి కాగా అసలైన సూత్రధారి వేరే వ్యక్త
రన్యారావ్‌ పాత్రధారి మాత్రమే-బంగారం రవాణా కింగ్‌పిన్‌ వేరే


బెంగళూరు , 7 మార్చి (హి.స.) బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. కిలో బంగారం రవాణాకు రన్యారావ్‌కు రూ.5 లక్షల కమీషన్‌ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నటి పాత్రధారి కాగా అసలైన సూత్రధారి వేరే వ్యక్తి అని తెలిసింది. నటి రన్యారావ్‌ను డీఆర్‌ఏ అధికారులు తీవ్ర విచారణ చేపట్టగా నేను పాత్రధారి మాత్రమే అని, అసలు వ్యక్తి వేరేవారని తెలిపింది. రూ.17 కోట్లు విలువ చేసే బంగారం కొనుగోలు చేసే శ్రీమంతురాలు కాదు.

ఈమె సీనియర్‌ పోలీస్‌ అధికారి పెంపుడు కూతురు కావడంతో ఆమెను ఈ దందాకు వాడుకుంటే చాలా సులభంగా బంగారం రవాణా చేయవచ్చనే అంచనాతో నటి రన్యారావ్‌ను బంగారం రవాణాకు వాడుకున్నారు. అక్రమ బంగారం రవాణాలో విమానాశ్రయంలోని కొందరు అధికారులు కూడా కుమ్మక్కైనట్లు అనుమానం వ్యక్తమైంది.

డీఆర్‌ఐ అధికారులు ఈ కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. బంగారం రవాణాలో రన్యారావ్‌కు రూ.4 లక్ష లనుంచి రూ.5 లక్షలు కమీషన్‌ ఇస్తున్నట్లు తెలిసింది. రన్యారావ్‌ బెంగళూరుకు తీసుకువచ్చిన బంగారం ఎవరికి ఇస్తుంది అనేదానిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. గత రెండేళ్లుగా రన్యారావ్‌ వాడుతున్న బ్యాంక్‌ అకౌంట్‌ మొబైల్‌ను అదికారులు స్వా«దీనం చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande