గాంధీనగర్:, 7 మార్చి (హి.స.)ప్రధాని మోదీ ఈనెల 8న గుజరాత్‌లోని నవ్‌సారీ జిల్లాలో జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి పూర్తిగా మహిళా పోలీసులే భద్రత కల్పిస్తారని రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవీ తెలిపారు. ఈ భద్రతా బలగంలో ఐపీఎస్ అధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకూ 2,300 మందికి పైగా మహిళా పోలీసులు ఉంటారని ఆయన చెప్పారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి కేవలం మహిళా పోలీసులే పహరా కాయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఈ కార్యక్రమానికి భద్రత కల్పించే మహిళా పోలీసు దళంలో మొత్తం 2100 మందికి పైగా కానిస్టేబుళ్లు, 187 మంది ఎస్సైలు, 61 మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, 16 మంది డీఎస్పీలు, ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీ, ఒక అదనపు డీజీపీ ఉంటారని మంత్రి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు