హైదరాబాద్, 8 మార్చి (హి.స.)
హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేశారు. మహిళా దినోత్సవ సంబరాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర సంస్థగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ..
వికసిత భారత్ మోడీ లక్ష్యం.. అభివృద్ధి చెందిన భారత్గా తీర్చి దిద్దడమే మోడీ విజన్ అని పేర్కొన్నారు. భారత్ ఎదుగుదలలో మహిళలే కీలకం కావాలని అన్నారు. భారత్ ఆర్థిక అభివృద్ధిలో మహిళా అమ్మ పాత్ర పోసించాలన్నదే మోడీ ఆలోచన అని తెలిపారు. 64 కోట్ల మంది హిందువులు కుంభమేళాలో పాల్గొని.. కుహానా మేధావుల కళ్ళు తెరిపించి, సనాతన ధర్మం గురించి చాటి చెప్పారని వెల్లడించారు. సనాతన ధర్మానికి గొప్ప చరిత్ర ఉంది.. పాశ్చాత్య సంస్కృతి వల్ల మన సనాతన సాంప్రదాయాలను మర్చిపోతున్నామని వ్యాఖ్యానించారు. సనాతన సంప్రదాయాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి మహిళా మీద ఉందని లక్ష్మణ్ చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..